పక్కా ప్లాన్ తోనే ఇండిగో విమానాలను రద్దు: మంత్రి రామ్మోహన్ నాయుడు

పక్కా ప్లాన్ తోనే ఇండిగో విమానాలను రద్దు: మంత్రి రామ్మోహన్ నాయుడు

ఇండిగో విమానాల రద్దు సంక్షోభానికి పూర్తిగా ఆ  ఎయిర్ లైన్స్ కారణమని పౌర విమానయాన  శాఖ  మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు..ఇండిగో క్రైసిస్ పై  రాజ్యసభలో చర్చ జరగగా సమాధానమిచ్చిన మంత్రి.. ఇండిగో ఎయిర్ లైన్స్ క్ర్యూ, ఇంటర్నల్ ప్లానింగ్ లోపం వల్లే ఈ సమస్య ఏర్పడిందన్నారు. FDTL ప్రమాణాలను అమలు చేయడంతో ఎటువంటి సమస్యా లేదని కేంద్ర మంత్రి సోమవారం (డిసెంబర్ 8) రాజ్యసభకు వివరించారు. 

నెలరోజులుగా ఇండిగో సంక్షోభం పై  విమానయాన శాఖ అబ్జర్వేషన్ లో ఉంది.. డిసెంబర్ 1న సంక్షోభం తీవ్రం అయినప్పుడు ఇండిగో యాజమాన్యంతో చర్చించాం.. అప్పుడు ఎటువంటి సమస్యా లేదు. ప్రతిదీ సవ్యంగా జరగుతోంది..అకస్మాత్తుగా డిసెంబర్ 3న ఇండిగో క్రైసిస్ పెరగడం చూశామన్నారు. వెంటనే మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకొని ఎయిర్ పోర్టులలో పరిస్థితిని చక్కబెట్టామన్నారు. ఇండిగో సంక్షోభంతో  ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నది నిజమే.. మేం  ఈ సమస్య ను తేలికగా తీసుకోం.. విచారణ సాగుతోందన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు. 

►ALSO READ | సరాఫా మార్కెట్లో యువకుల హల్చల్.. బైక్‌పై వచ్చి గన్ తో కాల్చేస్తామని బెదిరింపు..

ప్రస్తుతం విమానాల రాకపోకలు, ఛార్జీలపై ఎయిర్ లైన్స్ సంస్థలకు  గైడ్ లైన్స్ జారీ చేశామన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు. విమానాల రద్దుపై సాఫ్ట్ వేర్ సమస్యలపై కూడా విచారణ జరిగింది. విమానయాన రంగంలో టెక్నాలజీ  అప్ గ్రేడేషన్ జరుగుతోందన్నారాయన. 

సోమవారం కూడా 400 పైగా విమానాలు రద్దు.. 

ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభంతో దేశవ్యాప్తంగా సోమవారం కూడా దాదాపు 400 కు పైగా విమానాలు రద్దయ్యాయి. విమానాల రద్దుపై ఇండిగో సీఈవో పీటర్ ఎల్బన్స్ , ఎయిర్ లైన్ అకౌంటబుల్ మేనేజర్ ఇసిడ్రో కు ఏవియేషన్  రెగ్యులేటర్ DGCA గడువును ఆదివారం పొడిగించింది. ఈరోజు (సోమవారం ) సాయంత్రం 6గంటలతోపు వివరణ ఇవ్వాలని కోరింది.