ప్రపంచంలోని బెస్ట్ ఫుడ్ టాప్-5 సిటీల్లో ముంబై.. హైదరాబాద్ ర్యాంక్ ఎంతో తెలుసా..?

ప్రపంచంలోని బెస్ట్ ఫుడ్ టాప్-5 సిటీల్లో ముంబై.. హైదరాబాద్ ర్యాంక్ ఎంతో తెలుసా..?

ప్రపంచంలోని బెస్ట్ ఫుడ్ దొరికే సిటీల లిస్టులో భారతదేశంలోని ముంబై నగరం 5వ స్థానాన్ని దక్కించుకుంది. ఆన్‌లైన్ ఫుడ్ గైడ్ అయిన టేస్ట్‌అట్లాస్ విడుదల చేసిన 100 ఉత్తమ ఫుడ్ సిటీస్ జాబితాలో ముంబై ఆహార ప్రియుల మనస్సును గెలుచుకోవటం గౌరవంగా చెప్పుకోవచ్చు. ఈ జాబితాలో మొదటి నాలుగు స్థానాలు ఇటాలియన్ నగరాలకే దక్కాయి. మెుదటి స్థానంలో నేపుల్స్ ఉండగా.. మిలన్, బోలోగ్నా, ఫ్లోరెన్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ముంబైకి దక్కిన గౌరవం..
ముంబై ఫేమస్ ఫుడ్స్ అయిన.. వడ పావ్, పావ్ భాజీ, భేల్‌పురి వంటి ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ వంటకాలు 5 పాయింట్లకు 4.8 రేటింగ్ సాధించాయి. ముంబైని టాప్ 5 స్థానంలో నిలపటానికి ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. ఈ వంటకాలు నగరంలో ఎంతగానో అభిమానించబడే ప్రధాన ఆహారాలుగా ఉన్నాయని తేలింది. అయితే ముంబై తర్వాత 48వ స్థానంలో అమృత్‌సర్, 53వ స్థానంలో న్యూఢిల్లీ, 54వ స్థానంలో హైదరాబాద్.. ఇక ఇండియా నుంచి కోల్‌కతా 73వ స్థానం, చెన్నై 93వ ప్లైస్ దక్కించుకున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TasteAtlas (@tasteatlas)

అయితే ఈ టేస్ట్‌అట్లాస్ ర్యాంకింగ్‌లు విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ స్టార్ట్ అయ్యింది. ఆహారం అనేది వ్యక్తిగత అభిరుచికి సంబంధించినది కాబట్టి.. ఈ జాబితాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ముంబై 5వ స్థానంలో ఉండటం.. ఢిల్లీ, హైదరాబాద్‌ల కంటే చాలా ముందుండటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు వినియోగదారులు బ్యాంకాక్ వంటి ఫేమస్ ఫుడ్ సిటీ 62వ స్థానంలో ఉండటంపై కూడా విమర్శిస్తున్నారు. ఈ లిస్ట్ సరైనదా కాదా అనే విషయం పక్కన పెడితే.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆహారం గురించి మాట్లాడటానికి, కొత్త రుచులను కోరుకోవడానికి ఇది ఒక మంచి వేదిక కల్పించింది.