NTR Dragon: టామ్ క్రూజ్ లా ఎన్టీఆర్ స్టంట్స్.. 'డ్రాగన్' కోసం ప్రమాదకరమైన సాహసానికి రెడీ!

NTR Dragon:  టామ్ క్రూజ్ లా ఎన్టీఆర్ స్టంట్స్.. 'డ్రాగన్' కోసం ప్రమాదకరమైన సాహసానికి రెడీ!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'డ్రాగన్' .  భారీ యాక్షన్ తో వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ చిత్రానికి అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో  హల్ చల్ చేస్తోంది . ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ కు రెడీ అవుతోంది. 'కేజీఎఫ్', 'సలార్' వంటి పవర్‌ఫుల్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్, మాస్ హీరో ఎన్టీఆర్‌తో కలిసి చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. 
 
ప్రమాదకరమైన స్టంట్స్ కోసం తారక్ సాహసం!

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తన పోరాట సన్నివేశాల కోసం ఏమాత్రం డూప్‌ను ఉపయోగించడం లేదని తెలుస్తోంది. రాబోయే కీలక షెడ్యూల్‌లో చిత్రీకరించనున్న యాక్షన్ సీక్వెన్స్‌లు, గతంలో తారక్ చేసిన వాటి కంటే ఎక్కువ రిస్క్‌తో కూడుకున్నవని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల నటీనటులు తమ స్టంట్స్‌ను సొంతంగా చేయాలనే ట్రెండ్ పెరుగుతోంది.  గతంలో డూప్స్‌పై ఆధారపడిన సల్మాన్ ఖాన్ కూడా ఇప్పుడు తన కొత్త సినిమాల్లో సొంతంగా స్టంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి సూపర్ స్టార్ టామ్ క్రూజ్ మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా అదే చేస్తున్నారు అని సినీ వర్గాలు చెబుతున్నాయి.

 భారీ సెట్‌లు

ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ డిసెంబర్ 8న ప్రారంభం కానుంది. ఇది మూడు వారాల పాటు, క్రిస్మస్ వరకు నిరంతరంగా జరగనుంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షూటింగ్ కోసం భారీ సెట్‌లను నిర్మించినట్లు సమాచారం. ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం పూర్తిగా కొత్త మేకోవర్‌లో కనిపిస్తున్నారు. సన్నబడిన, టోన్డ్ బాడీతో పాటు, దట్టమైన గడ్డంతో రఫ్ అండ్ పవర్ ఫుల్ లుక్‌లో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారు.  ప్రశాంత్ నీల్ సినిమాకు తగ్గట్టుగా ఎన్టీఆర్ పాత్ర భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, ఇది మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన 'కాంతార: చాప్టర్ 1' ఫేమ్ కన్నడ నటి రుక్మిణి వసంత్ ఇందులో కథానాయికగా నటిస్తుంది. మలయాళ స్టార్స్ టొవినో థామస్, బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాక, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ పవర్ ఫుల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది.  మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రాన్ని జూన్, 2026న విడుదల  చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ 'NTRNeel' సినిమా బాక్సాఫీస్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.