క్యూర్ , ప్యూర్, రేర్ మోడల్ తో తెలంగాణ అభివృద్దిలో ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో మాట్టాడిన భట్టి.. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. కేవలం పెట్టుబడులు ఆకర్షించడానికి సమ్మిట్ పెట్టలేదు.. మా విజన్ ఏంటో అందరికీ వివరిస్తామన్నారు భట్టి.
క్యూర్ , ప్యూర్, రేర్ మోడల్ తో తెలంగాణ అభివృద్దిలో ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ అభివృద్దికి అనేక లక్ష్యాలతో మా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఒక్కో అంశంపై ఒక్కో ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు.
►ALSO READ | Telangana Global Summit : ప్రపంచంలో బెస్ట్ రాష్ట్రంగా ఎదగాలన్నదే మా కల: సీఎం రేవంత్ రెడ్డి
విద్యుత్ సంస్కరణల వంటి అనేకమైన సంస్కరణలు తీసుకురాబోతున్నాం.. తెలంగాణ విజన్‌కు సహకరించాలని విపక్షాలను కోరుతున్నామన్నారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పన తర్వాత కూడా మా యాక్షన్ ప్లాన్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి.
