బానాజీపేటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

బానాజీపేటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రఘునాథపల్లి, వెలుగు: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం బానాజీపేటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆవిష్కరించారు. 

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ పరోక్షంగా రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు.   అనంతరం స్టేషన్ ఘనపూర్ మండలంలోని తానేదార్‌‌‌‌‌‌‌‌పల్లిలో సీసీ రోడ్లు, 91 ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు.