అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీ ప్రవేశాల గడువు పెంపు

అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీ ప్రవేశాల గడువు పెంపు

హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2022‌‌–23 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. వర్సిటీ అందిస్తున్న డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి ఈనెల 16 వరకు అవకాశమిచ్చారు. విద్యార్హతలు, ఫీజులు తదితర వివరాల కోసం సమీపంలోని స్టడీ సెంటర్.. లేదా వర్సిటీ వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో దూరవిద్య ద్వారా ఉన్నత చదువులు చదవాలను కుంటున్న వాళ్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.