
అంబర్‌పేట, వెలుగు: తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి వాటిని విస్మరించిందని అంబర్‌పేట్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సి. రోహిన్ రెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
ప్రచార పాదయాత్రలో సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు నియోజకవర్గ ఓటర్లు తనకు అవకాశం కల్పించాలని కోరారు. 30న జరిగే పోలింగ్‌లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. రోహిన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు యాదగిరి రావు, రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు భారీగా పాల్గొన్నారు.