- అంబులెన్స్కూ దారివ్వని కార్యకర్తలు
- ఎమ్మెల్యేను అక్కడినుంచి తరలించిన పోలీసులు
ఉప్పల్, వెలుగు: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పుట్టినరోజు వేడుకలతో ఉప్పల్ లో వరంగల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు ట్రాఫిక్ లో ఇరుక్కొని గంటల తరబడి అవస్థలు పడ్డారు. అంబులెన్స్ లు సైతం ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. శుక్రవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నల్లచెరువు వద్ద ప్రైవేట్ స్థలంలో వేడుకలకు అనుమతించాలని నియోజకవర్గ నేతలు పోలీసులను కోరారు. దానికి పోలీసులు నిరాకరించడంతో ఎమ్మెల్యే తన కార్యకర్తలతో ఉప్పల్ రింగ్ రోడ్ వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లారు. ఉప్పల్ రింగ్ రోడ్ చౌరస్తాలో కేక్ కట్ చేశారు.దీనివల్ల కూడలిలో వద్ద నాలుగు వైపుల నుంచి వచ్చే వెహికల్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని అక్కడి నుంచి తరలించారు.
