అంబూరు ఫెస్టివల్.. బీఫ్, పోర్క్ బిర్యానీలకు అనుమతివ్వ లేదని కలెక్టర్‌‌కు నోటీసులు

అంబూరు ఫెస్టివల్.. బీఫ్, పోర్క్ బిర్యానీలకు అనుమతివ్వ  లేదని కలెక్టర్‌‌కు నోటీసులు

చెన్నైలోని ఓ ప్రాంతంలో సంప్రదాయబద్ధంగా అంబూరు బిర్యానీ ఫెస్టివల్ జరుగుతుంటుంది. ఇందులో దాదాపు 20 రకాల బిర్యానీలతో ఆ ఫెస్టివల్ ఘుమఘుమలాడుతుంటుంది. ఈ ఫెస్టివల్ రావడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే.. బీఫ్, పోర్క్ మాంసంతో బిర్యానీ వండటానికి వీలు లేదని జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై తమిళనాడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ సీరియస్ అయ్యింది. జిల్లా కలెక్టర్ కు ఏకంగా నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన తిరుపత్తూరులో చోటు చేసుకుంది. 

తిరుపత్తూరులో అనాదిగా అంబూరు బిర్యానీ జాతర నిర్వహిస్తుంటారు. 20 రకాలతో కూడిన బిర్యానీలు వండి వడ్డిస్తారు. మే 13వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఈ ఫెస్టివల్ జరగాల్సి ఉంది. అయితే.. భారీ వర్షాల కారణంగా జాతరను తాత్కాలికంగా రద్దు చేసింది. ఇదంతా ఒకవైపు ఉంటే... జిల్లా కలెక్టర్, అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమై కూర్చొంది. చికెన్, మటన్, చేపలు, రొయ్యలకు బిర్యానీలకు మాత్రమే అనుమతినిచ్చింది.

గొడ్డు, పోర్క్ మాంసాలకు అనుమతి లేదని, వీటిని స్టాల్స్ లో పెట్టొద్దంటూ తిరుపత్తూరు జిల్లా కలెక్టర్ అమర్ ఖుష్ వాహ ఆదేశాలు జారీ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వర్గం వివక్ష కిందకే వస్తుందని.. దీనిని అంటరానితనంగా పరిగణిస్తున్నట్లు కమిషన్ పేర్కొంది. మతప్రాదికన ఎందుకు వివక్షగా పరిగణించకూడదో చెప్పాలంటూ.. ఈ మేరకు కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. వాటిని ఎందుకు అనుమతినివ్వలేదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం : 

బుద్ధవనం ప్రాజెక్టుకు కేంద్ర నిధులు

యాత్రికుల బస్సులో మంటలు.. ఉగ్ర కుట్ర ఉందా ?