
జమ్మూ : జమ్మూ కశ్మీర్‌లో విషాదం చోటు చేసుకుంది. యాత్రికులు వెళుతున్న బస్సులో మంటలు చెలరేగడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన కత్రాలో చోటు చేసుకుంది. శుక్రవారం కొంతమంది యాత్రికులు మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రానికి బేస్ క్యాంపుకు బయలుదేరారు. కత్రా నుంచి మీదుగా బస్సు వెళుతోంది. శనిదేవ్ ఆలయం సమీపంలోకి చేరుకున్న అనంతరం బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాణాలు రక్షించుకోవడానికి యాత్రికులు ప్రయత్నించారు.
కొంతమంది మాత్రం మంటల్లో చిక్కుకపోయారు. నలుగురు చనిపోయారని అధికారులు నిర్ధారించారు. ఇంజిన్ ప్రాంతం నుంచి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే.. బస్సులో పేలుడు సంభవించిన తర్వాతే.. మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించినట్లు సమాచారం. బస్సు మొత్తం మంటలు వ్యాపించాయని వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం 20 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
వీరిని చికిత్స నిమిత్తం కట్రా ప్రాంతంలోని ఆసుపత్రికి తరలించారు. జమ్మూకు వెళుతున్న బస్సు (JK14/1831) కత్రాకు కిలోమీటర్ దూరంలో బస్సులో మంటలు చెలరేగాయని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎఫ్ఎస్ఎల్ బృందాన్ని నియమించినట్లు తెలిపారు. ఉగ్ర కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తల కోసం
బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్ నోటీసులు.. ఆధారాలుంటే బయటపెట్టాలి
శారీరక, మానసికోల్లాసానికి క్రీడలు దోహదం