బుద్ధవనం ప్రాజెక్టుకు కేంద్ర నిధులు

V6 Velugu Posted on May 13, 2022

హైదరాబాద్: నల్గొండలోని నాగార్జున సాగర్ లో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ ఈ నెల 14న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. బుద్ధవనం  ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ. 22.24 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదన్న మంత్రి... కేంద్ర టూరిజం మంత్రినైన తనను పిలవకుండా రాష్ట్ర ప్రభుత్వం అవమానించదన్నారు. ఇకపోతే... రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అమిత్ షా పర్యటనతో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నిత్యం ఇరుపార్టీల నాయకులు ఒకరిపైనొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. తనను అవమానించారని ఆరోపిస్తూ మంత్రి కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇక రేపు కేంద్ర మంత్రి అమిత్ షా ముచ్చింతల్ కు రానున్న నేపథ్యంలో మంత్రి కిషన్ రెడ్డి పెట్టిన తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తల కోసం...

పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్లతో సీపీ ఆనంద్ మీటింగ్

బండి సంజయ్‌‌కి మంత్రి కేటీఆర్ నోటీసులు.. ఆధారాలుంటే బయటపెట్టాలి

Tagged Minister, FUNDS, KTR, Kishan reddy, Inauguration, budhavanam project

Latest Videos

Subscribe Now

More News