పంజాగుట్ట, అమీర్ పేట మార్కెట్లు క్లోజ్..

పంజాగుట్ట, అమీర్ పేట మార్కెట్లు క్లోజ్..

హైదరాబాద్లో రెండు ముఖ్యమైన మార్కెట్లు మూతపడనున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట, అమీర్ పేటలోని మున్సిపల్ మార్కెట్లను జీహెచ్ఎంసీ మూసివేయనుంది. దీనికి కారణం ఈ రెండు మార్కెట్లలోని భవనాలు, దుకాణాల సముదాయాలు శిథిలావస్థలకు చేరుకోవడమే. 

అమీర్ పేట్ లోని మున్సిపల్ మార్కెట్ 1175 చదరపు గజాల్లో ఉంటుంది. ఇక్కడ 82 దుకాణాలు, రెండు కార్యాలయ గదులు ఉన్నాయి. పంజాగుట్ట మున్సిపల్ మార్కెట్ 800 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ 45 దుకాణాలు, రెండు కార్యాలయ గదులు ఉంటాయి. అయితే దుకాణాలు, కార్యాలయ గదులన్నీ శిథిలావస్థకు చేరుకోవడంతో వీటిని కూల్చివేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 

ALSO READ : యానిమల్ నుండి రష్మిక పోస్టర్.. ట్రెడిషనల్ లుక్ అదుర్స్

అమీర్ పేట, పంజాగుట్ట మున్సిపల్ మార్కెట్ల స్థానంలో కొత్త దుకాణాలు, కార్యాలయ గదులు నిర్మించనుంది జీహెచ్ఎంసీ. అమీర్ పేట మున్సిపల్ మార్కెట్ ను కూల్చివేసి దాని స్థానంలో రూ. 8.66 కోట్లతో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు..నాలుగు అదనపు అంతస్తులు, టెర్రస్ ఫ్లోర్ ను నిర్మించనుంది.  అటు పంజాగుట్ట మున్సిపల్ మార్కెట్ ప్లేస్ లో రూ. 5.36 కోట్ల వ్యయంతో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు..నాలుగు అదనపు అంతస్తులు, టెర్రాస్ ఫ్లోర్ నిర్మాణాన్ని చేపట్టనుంది జీహెచ్ఎంసీ.  

పంజాగుట్ట, అమీర్ పేట మున్సిపల్ మార్కెట్ల నిర్మాణానికి ఇప్పటికే జీహెచ్ఎంసీ నిర్మాణ ఏజెన్సీల నుంచి బిడ్ లను కోరింది జీహెచ్ఎంసీ. ఈ ప్రాజెక్టుకు జీహెచ్ఎంసీ 2022లో పరిపాలన అనుమతులు కూడా జారీ చేసింది.  ఏడాది లోగా ఈ నిర్మాణాలను పూర్తి చేయాలని గడువు పెట్టుకుంది.