యానిమల్ నుండి రష్మిక పోస్టర్.. ట్రెడిషనల్ లుక్ అదుర్స్

యానిమల్ నుండి రష్మిక పోస్టర్.. ట్రెడిషనల్ లుక్ అదుర్స్

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ బాలీవుడ్ మూవీ యానిమల్(Animal). డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో స్టార్ కిడ్ రణ్బీర్ కపూర్(Ranbir kapoor), రష్మిక మందనా(Rashmika mandanna) హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇప్పటికే సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ అండ్ వీడియోస్ ఆ అంచనాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్ళుతున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుండి రష్మిక లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ లుక్ లో రష్మిక ట్రెడిషనల్ వియర్ లో చాలా అందంగా కనిపిస్తోంది. సంప్రదాయ బద్దంగా ఉన్న ఈ లుక్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ లుక్ తో యానిమల్ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. 

Also Read :- ఇకపై అమెజాన్లో యాడ్స్ మోత.. ప్రైమ్ యూజర్స్కు షాక్

ఇక ఈ సినిమా టీజర్ సెప్టెంబర్ 28న రేలసే చేయనున్నట్లు ప్రకటిచారు మేకర్స్. దీంతో రణ్బీర్ ఫ్యాన్స్ ఈ టీజర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. యానిమల్ టైటిల్ అండ్ లుక్స్ కూడా చాలా వైలెంట్ గా ఉండటంతో.. ఈ సినిమా కూడా అర్జున్ రెడ్డి లాగే ట్రెండ్ సెట్టింగ్ సినిమా అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.