జీవో నెంబర్ 252ను సవరించాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

జీవో నెంబర్ 252ను సవరించాలి : సీపీఎం రాష్ట్ర  కార్యదర్శి జాన్ వెస్లీ
  • సీపీఎం రాష్ట్ర  కార్యదర్శి జాన్​ వెస్లీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 252ను సవరించి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్​చేశారు. ఈ  జీవో ద్వారా జర్నలిస్టులను వర్గీకరించారని, రిపోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డులు, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డులు ఇవ్వాలని నిర్ణయించడం సరికాదని తెలిపారు. 

అలాగే అక్రెడిటేషన్​ కార్డుల సంఖ్య తగ్గించడంతో  డెస్క్ జర్నలిస్టులతోపాటు చిన్న, మధ్యతరహా పత్రికల్లో పనిచేస్తున్న వేలాది మంది వర్కింగ్ జర్నలిస్టులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు కనీస భద్రత, సంక్షేమం అందడం లేదని జాన్​వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు.  ఆరోగ్య బీమా అమలు కావడంలేదని, హెల్త్ కార్డులపై కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స అందడం లేదని చెప్పారు.