జీవో 252ను సవరించాలి..అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇవ్వాలి : హెచ్ యూజే

జీవో 252ను సవరించాలి..అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇవ్వాలి : హెచ్ యూజే
  •     సమాచార శాఖ డైరెక్టర్ కు హెచ్ యూజే వినతి

హైదరాబాద్,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అక్రెడిటేషన్‌‌‌‌‌‌‌‌ల జీవో 252లో అనేక లోపాలున్నాయని, వెంటనే వాటిని సవరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని హెచ్ యూజే, టీడబ్ల్యూజేఎఫ్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం సమాచార శాఖ డైరెక్టర్ కిషోర్ బాబు, అడిషనల్ డైరెక్టర్ జగన్ ను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు.

జర్నలిస్టులను రెండు వర్గాలుగా విభజించడం సరికాదని ఫెడరేషన్ నాయకులన్నారు.  రిపోర్టర్లకు అక్రెడిటేషన్ అని, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు అని పేర్లు పెట్టడం అన్యాయమన్నారు.  

ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. డెస్కు జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొత్త నిబంధనల వల్ల చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు దక్కకుండా పోతున్నాయని చెప్పారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డు ఇవ్వాల్సిందేనని హెచ్​యూజే, టీడబ్ల్యూజేఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్​ రాష్ట్ర అడ్ హక్ కమిటీ కన్వీనర్ పిల్లి రాంచందర్​, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.