ప్రపంచంలో ఈ కంపెనీలకు ఎదురేలేదు.. ట్రెండ్ సెట్ చేయాలన్న, ధరలు నిర్ణయించాలన్న వీటితోనే

ప్రపంచంలో ఈ కంపెనీలకు ఎదురేలేదు.. ట్రెండ్ సెట్ చేయాలన్న, ధరలు నిర్ణయించాలన్న వీటితోనే

న్యూఢిల్లీ: కొన్ని  కంపెనీలు ట్రెండ్ ఫాలో కావు. సెట్ చేస్తాయి. తాము నిర్ణయించేదే ధర. వీటిని ఎదుర్కొనే  కంపెనీలు కనుచూపుమేరల్లో కూడా కనిపించవు. ఇవి సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తంలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.  తానై చక్రం తిప్పుతున్నాయి.  టెక్నాలజీ నుంచి ఏఐ చిప్‌‌‌‌‌‌‌‌లు, క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌ వరకు ఈ గ్లోబల్ దిగ్గజాలు విపరీతమైన మార్కెట్ షేర్‌‌‌‌‌‌‌‌ను సాధించాయి. వీటిలో అమెరికన్ కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి.  

అవి..

గూగుల్‌‌‌‌‌‌‌‌

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ సెర్చ్, ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ అడ్వర్టైజింగ్‌‌‌‌‌‌‌‌లో మోనోపోలీ (ఏక చత్రాధిపత్యం) సాధించింది. సెర్చ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో అధికారికంగా మోనోపోలీగా గుర్తింపు పొందింది కూడా. ప్రజలు, వ్యాపారాలు సమాచారాన్ని ఎలా పొందాలో గూగుల్ నియంత్రిస్తోంది. ఈ కంపెనీకి చెందిన అడ్వర్టైజింగ్ బేస్డ్  బిజినెస్ మోడల్ ఈ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను   మరింత బలపరుస్తోంది.

మైక్రోసాఫ్ట్

డెస్క్‌‌‌‌‌‌‌‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌లలో విండోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 88 శాతం మార్కెట్ వాటా ఉంది. ఆఫీస్‌‌‌‌‌‌‌‌ టూల్స్, అజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లౌడ్ సేవలతో వినియోగదారులు, సంస్థలపై దీర్ఘకాల ప్రభావం చూపుతోంది.

అమెజాన్‌‌‌‌‌‌‌‌

ఈ–-కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్‌‌‌‌‌‌‌‌లో ఈ కంపెనీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఏడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్లౌడ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌గా ఎదిగింది.  ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ షాపింగ్‌‌‌‌‌‌‌‌లో లాజిస్టిక్స్, ధరలను అమెజాన్ కంట్రోల్ చేస్తోంది.

యాపిల్‌‌‌‌‌‌‌‌

ఐఫోన్‌‌‌‌‌‌‌‌, మాక్‌‌‌‌‌‌‌‌, వేర్‌‌‌‌‌‌‌‌బుల్స్ ద్వారా హార్డ్‌‌‌‌‌‌‌‌వేర్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో యాపిల్ ఆధిపత్యం కొనసాగుతోంది. యాప్ స్టోర్  ద్వారా డెవలపర్లపై కూడా ప్రభావం చూపుతోంది.

ఎన్విడియా

ఏఐ చిప్స్, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌‌‌‌‌‌‌‌(జీపీయూ)ల తయారీలో 80 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. ఏఐ డిమాండ్ పెరుగుతుండడంతో కంపెనీ వాల్యూయేషన్  దూసుకుపోతోంది. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా ఎదిగింది. 

ఎల్‌‌‌‌‌‌‌‌వీఎంహెచ్‌‌‌‌‌‌‌‌

ఫ్రెంచ్ కంపెనీ ఎల్‌‌‌‌‌‌‌‌వీఎంహెచ్ (లూయీ విట్టన్‌‌‌‌‌‌‌‌) ప్రపంచంలో అతిపెద్ద లగ్జరీ గూడ్స్ కంపెనీ. ఫ్యాషన్, జ్యువెలరీ, కాస్మెటిక్స్, స్పిరిట్స్‌‌‌‌‌‌‌‌లో 22శాతం మార్కెట్ షేర్ సాధించింది. ట్రెండ్స్, ప్రైస్ స్టాండర్డ్స్‌‌‌‌‌‌‌‌ను, రిటైల్ అంచనాలను నిర్ణయించే స్థాయికి ఎదిగింది.

టెస్లా

గ్లోబల్‌‌‌‌‌‌‌‌లో ఈవీ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఛార్జింగ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, బ్రాండ్ ప్రభావం, టెక్నాలజీ లీడర్‌‌‌‌‌‌‌‌షిప్ వల్ల శక్తివంతమైన కంపెనీగా ఎదిగింది. చైనీస్‌‌‌‌‌‌‌‌ కంపెనీ బీవైడీ వంటి కొత్త పోటీదారులు వచ్చినా, టెస్లా  టాప్‌లో కొనసాగుతోంది.

సౌదీ ఆరామ్‌‌‌‌‌‌‌‌కో

ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ కంపెనీ. ఒపెక్స్ ప్లస్‌‌‌‌‌‌‌‌లో కీలక పాత్ర పోషిస్తోంది.  గ్లోబల్ క్రూడ్ ధరలపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ మద్దతు, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి వంటి అంశాలు ఈ కంపెనీని గ్లోబల్‌‌‌‌‌‌‌‌ శక్తిగా నిలిపాయి.

మెటా

ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌, వాట్సాప్‌‌‌‌‌‌‌‌ వంటి ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌ల ద్వారా డిజిటల్ కమ్యూనికేషన్, అడ్వర్టైజింగ్, సోషల్ డేటాలో ఈ కంపెనీ ముందుంది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా టిక్‌‌‌‌‌‌‌‌టాక్ పోటీ పెంచినా, మెటా ఇంకా అనేక ప్రాంతాల్లో యూజర్ ఎంగేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతోంది.