గచ్చిబౌలి మారియట్ హోటల్లో అనుమానాస్పద స్థితిలో అమెరికన్ మృతి

గచ్చిబౌలి మారియట్ హోటల్లో అనుమానాస్పద స్థితిలో అమెరికన్ మృతి
  • 12వ అంతస్థు రూమ్​లో డెడ్​బాడీ  
  • కనిపించని బిజినెస్​ పార్ట్​నర్​

గచ్చిబౌలి, వెలుగు : గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఒక హోటల్​గదిలో అనుమానాస్పద స్థితిలో ఓ అమెరికన్​చనిపోయాడు. కాలిఫోర్నియాకు చెందిన  మిచెల్ బ్రియాన్​ లీ(41) బిజినెస్​కోసం తన పార్ట్​నర్​డేవిడ్​వుతో కలిసి ఈ నెల 2న హైదరాబాద్​గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్​ టర్మినస్​లోని మారియట్​ఎగ్జిక్యూటివ్​అపార్ట్​మెంట్​12వ అంతస్థు రూమ్​ నెంబర్​1218లో దిగాడు. 

5న బ్రియాన్​లీ ఫోన్​కాల్స్​కు రెస్పాండ్​కాకపోవడంతో హోటల్​సిబ్బంది గది డోర్​ తెరిచి చూడగా మంచంపై అపస్మారక స్థితిలో కనిపించాడు. 108 సిబ్బంది వచ్చి చెక్​ చేయగా అప్పటికే చనిపోయాడు. లీ బిజినెస్​పార్ట్​నర్​డేవిడ్​వు కనిపించడం లేదు. అతడి కోసం ఎంక్వైరీ చేస్తున్నారు. డెడ్​బాడీని ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.