
మారుతున్న లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాల్లో మార్పులు వస్తున్నాయి. దీని కారణంగా ఎన్నో సమస్యలు ఎదురువుతున్నాయి. ముఖ్యంగా బ్లడ్ ప్రెజర్.. రక్తపోటులో వస్తున్న మార్పులు ఆందోళన కలిగించే అంశాలు. అయితే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA).. ఇటీవల రక్తపోటు (హై బ్లడ్ ప్రెషర్) చికిత్సకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
యూఎస్ లో దాదాపు 46.7 శాతం మంది పెద్దవాళ్లు రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇది అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మరణాలకు కారణం అవుతోందని వెల్లడించింది. అందుకోసం కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసిన AHA.. ఏ స్థాయిలో ఉంటే ఎంత ప్రమాదం.. చికిత్స ఎప్పుడు అవసరమో ఈ మార్గదర్శకాల్లో చెప్పింది. అయితే కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసినప్పటికీ.. రక్తపోటుకు సంబంధించి 2017లో ప్రకటించిన ప్రమాణాలను కొనసాగించింది. అవి
సాధారణ రక్తపోటు: 120/80 mmHg కంటే తక్కువ. అంటే 120/80 కంటే తక్కువ స్థాయిలో బీపీ ఉంటే నార్మల్ గా ఉన్నట్లు.
ఎలివేటెడ్: 120–129 mmHg నుంచి <80 mmHg అంటే బీపీ 120–129 సిస్టోలిక్ పీడనం (అంటే రక్తాన్ని నరాల్లోకి పంపే పీడనం) ఉండటం లేదా 80 డయాస్టోలిక్ పీడనం కంటే తక్కువగా ఉంటే అది ఎలివేటెడ్ బ్లడ్ ప్రెజర్ గా పేర్కొన్నారు.
స్టేజ్ 1 హైపర్‌టెన్షన్: 130–139 mmHg లేదా 80–89 mmHg. సిస్టోలిక్ పీడనం 130–139 mmHg వద్ద ఉండటం లేదా.. డయాస్టోలిక్ ప్రెజర్ 80–89 mmHg దగ్గర ఉండటం స్టేజ్ 1 హైపర్ టెన్షన్ కు సంకేతాలుగా తెలిపారు. ఇది ప్రమాదకరంగా సూచించారు.
స్టేజ్ 2 హైపర్‌టెన్షన్: ≥140 mmHg లేదా ≥90 mmHg.. అంటే సిస్టోలిక్ పీడనం 140 దాటితే లేదా డయాస్టోలిక్ 90 mmHg దాటితే అది స్టేజ్ 2 హైపర్ టెన్షన్ గా మార్గదర్శకాల్లో చెప్పారు. ఇది మరింత ప్రమాదమని.. స్టేజ్ 1, స్టేజ్ 2 హైపర్ టెన్షన్స్ కారణంగా.. గుండెపోటు ప్రమాదం పెరుగుతోందని గైడ్ లైన్స్ విడుదల చేశారు.
లేటెస్టుగా విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం.. హైపర్ టెన్షన్ స్టేజ్1, స్టేజ్ 2 స్థాయిలో ఉన్నప్పుడు ఏ దశలో చికిత్స అవసరం.. ఎలాంటి జీవన శైలిని అలవర్చుకోవాలో మార్గదర్శకాల్లో పేర్కొంది.
►ALSO READ | మీకు షుగర్ ఉందా.. అయితే మీ గుండె షేప్ మారిపోతుంది అంట.. పరిశోధనలో షాకింగ్ విషయాలు
స్టేజ్ 1 దశలో లైఫ్ స్టైల్ లో మార్పులు అవసరం అని సూచించింది. వీటితో పాటు పాటు అవసరమైతే మందులు వాడాలని సిఫారసు చేసింది. ప్రివెంట్ రిస్క్ కాలిక్యులేటర్ ద్వారా గుండె, మూత్రపిండాలు, జీవక్రియ ఆరోగ్యాన్ని కలిపి వ్యాధి ప్రమాదాన్ని అంచనా వేసే కొత్త పద్ధతిని తీసుకొచ్చింది.
హైపర్ టెన్షన్ బారిన పడకుండా లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవాలని సూచించారు సైంటిస్టులు. పోషకాహారం, శారీరక వ్యాయామం, బరువు నియంత్రణపై మరింత దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రక్తపోటు కారణంగా మెదడు పనితీరుపై ప్రభావం ఉంటుందని కొత్త అధ్యయనాలు సూచిస్తున్నాయని తెలిపారు. దీని కారణంగా మతిమరుపు (డిమెన్షియా) ప్రమాదం ఉందని హెచ్చరించారు.
రక్తపోటు గురించి చేసే మొదటి పరీక్షల్లోనే మూత్రపిండాల పనితీరును అంచనా వేసే పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. ఊబకాయం లేదా అధిక బరువున్న రక్తపోటు రోగులకు GLP-1 మందులు ఉపయోగకరమని కొత్త గైడ్ లైన్స్ ద్వారా తెలిపారు.