కరోనా వైరస్ అరికట్టడానికి అమెరికా నిబంధనలు అమలులో ఉన్న కారణంగా విదేశీ విద్యార్థులందరికీ ఆగస్టు 1 తర్వాత మాత్రమే తమ దేశంలోకి అనుమతిస్తామని హైదరాబాద్ కాన్సులేట్ మంగళవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. వీసా(F) లు పొందినప్పటికీ ప్రస్తుతం వైరస్ వ్యాప్తి కారణంగా వారిని దేశంలోకి పర్మిషన్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. భారత్‌తో పాటు చైనా, ఇరాన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా విద్యార్థులకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని ప్రకటించింది.
