అమెరికా అమ్మాయి.. సిరిసిల్ల కుర్రాడు ఒక్కటైన్రు

అమెరికా అమ్మాయి.. సిరిసిల్ల కుర్రాడు ఒక్కటైన్రు

ప్రేమకు సరిహద్దులు లేవని మరోసారి రుజువు చేసిందీ జంట. అబ్బాయిదేమో తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లి... అమ్మాయిదేమో అమెరికా. ఆ ఇద్దరినీ కలిపింది మాత్రం అఫ్గానిస్థాన్ గడ్డ. ప్రస్తుతం తాలిబాన్ల చేతిలోకి వెళ్లి.. సంక్షోభంలో ఉన్న అఫ్గాన్ లో ఈ ఇద్దరికీ తొలి పరిచయమైంది. మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన ఆకుల శ్రీకాంత్​ గౌడ్ అఫ్గాన్ లోని మూవన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. యూఎస్ ఆర్మీ సోల్జర్​ షకీర పీటర్సన్... సంక్షోభంలో ఉన్న అఫ్గాన్ లో డ్యూటీలో ఉంది. ఈ సమయంలో ఇద్దరికీ మూడేళ్ల క్రితం పరిచయమైంది. ఆ పరిచయం స్నేహంగా మారి.. ఒకరి భావాలు మరొకరికి నచ్చడంతో ప్రేమ చిగురించింది. ఇద్దరూ ఇంట్లో ఒప్పించి.. పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఎట్టకేలకు ఆదివారం హైదరాబాద్ లో పెండ్లి చేసుకున్నారు. నిన్న వాలంటైన్స్ డే నాడు శ్రీకాంత్ తన భార్యతో సొంతూరు వెళ్లాడు. ఈ వధూవరులను తల్లిదండ్రులు, బంధువుల అంతా ఆశీర్వదించాడు.

:: ఎల్లారెడ్డిపేట, వెలుగు

మరిన్ని వార్తల కోసం..

శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ప్లాస్టిక్‌‌ వేస్ట్‌‌తో మొబైల్‌‌ ఫోన్‌‌