కర్ణాటకలో బైక్ టాక్సీ బ్యాన్.. బెంగళూరీలు తెలివిగా ఏం చేస్తున్నారంటే..?

కర్ణాటకలో  బైక్ టాక్సీ బ్యాన్.. బెంగళూరీలు తెలివిగా ఏం చేస్తున్నారంటే..?

Bengaluru News: రద్దీతో నిండి ఉండే రోడ్లలో ప్రయాణానికి బైక్స్ సౌకర్యవంతం. అందువల్లే చాలా మంది బైక్ టాక్సీలను దేశంలో వినియోగిస్తున్నారు. కానీ కర్ణాటక ప్రభుత్వం మాత్రం బైక్ టాక్సీ సేవలు రవాణా చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ జూన్ 16 నుంచి నిలిపివేసింది. అయితే కర్ణాటక హైకోర్టు కూడా దీనినే సమర్థించటంతో ఓలా, ఉబెర్, ర్యాపిడోలు చేసేది లేక తమ టాక్సీ సేవలను నిలిపివేశాయి. అయినప్పటికీ ఈ కంపెనీల సేవలు బెంగళూరు లాంటి నగరాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. 

ప్రస్తుతం ఉబెర్, ర్యాపిడోలు బైక్ టాక్సీ సేవలను నిలిపివేసినప్పటికీ.. బైక్ పార్సిల్, మోటో కొరియర్ అంటూ పార్శిల్ సేవలను మాత్రం కొనసాగిస్తున్నట్లు కొందరు యూజర్లు వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియోలో షేర్ చేస్తున్నారు. ఈ సంస్థలు కర్ణాటక ప్రభుత్వ బ్యాన్ నిబంధనలను పార్శిల్ సేవల పేరుతో బైపాస్ చేశాయని కొందరు అంటున్నారు. 

ఇప్పుడు బెంగళూరుతో పాటు కర్ణాటకలోని అనేక నగరాల్లోని ప్రజలు పార్శిల్ పేరుతో రైడ్ బుక్కింగ్ చేసుకోవచ్చని ట్రోల్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రయాణికులు తమను తాము పార్శిల్ చేసుకుంటే బైక్ పార్శిల్, మోటో కొరియర్ సేవల కింద వెళ్లిపోవచ్చంటూ కామెడీ ఎమోజీలతో పోస్ట్ పెట్టారు. ఇదే క్రమంలో ధన్వీ అనే మరో యూజర్ పార్శిల్ యాస్ ఏ సర్వీస్ పేరుతో దీనిని వినియోగించుకోవచ్చంటూ ట్వీట్ చేశారు. 

 

అయితే బెంగళూరు నగరంలో ప్రతి చోటా ట్రాఫిక్స్ జామ్స్ సర్వ సాధారణంగా మారిపోగా.. బైక్ టాక్సీ సేవలు చాలా వరకు దాని నుంచి రిలీఫ్ ఇస్తుండగా.. ప్రస్తుతం ప్రభుత్వం వాటిని కూడా రద్దు చేయటంపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త స్టార్టప్ కంపెనీలు తీసుకొస్తున్న సేవలను ముందుకు తీసుకెళ్లేందుకు చట్టాలను మార్చటం లేదా అవసరమైన నిబంధనలను తీసుకురావాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వాలు చూడాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీనికి ముందు 2019లో ఓలా క్యాబ్ అగ్రికేటర్ సేవలపై కర్ణాటక ప్రభుత్వం 6 నెలల పాటు బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే.