Crypto: మన క్రిప్టో ఎక్స్ఛేంజీలు సేఫేనా.. ఇండియన్ ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సిందే..

Crypto: మన క్రిప్టో ఎక్స్ఛేంజీలు సేఫేనా.. ఇండియన్ ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సిందే..

Crypto Safety: గడచిన కొన్ని నెలలుగా క్రిప్టో కరెన్సీలు ఇన్వెస్టర్లపై లాభాల వర్షం కురిపిస్తున్నాయి. బిట్‌కాయిన్ ఏకంగా లక్ష 24వేల డాలర్ల మార్కును కూడా తాకింది. ఈ సమయంలో మధ్యతరగతి ఇన్వెస్టర్లు కూడా సాధారణ ఈక్విటీలను వదిలి క్రిప్టో పెట్టుబడులపై మనసు పడుతున్నారు. కొంచెం రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేస్తే తామకు కూడా మంచి రాబడులు వస్తాయని అనుకుంటున్నారు. అయితే మరోపక్కన వరుసగా జరుగుతున్న క్రిప్టో సైబర్ దాడులు కొంత ఆందోళన చెందుతున్నారు. అసలు క్రిప్టో ఎక్స్ఛేంజీలు ఎంత వరకు సేఫ్ అనే ప్రశ్నలు చాలా మంది కొత్త ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం....

వాస్తవానికి క్రిప్టో కరెన్సీలు అనే కాన్సెప్ట్ ఒక అపనమ్మకం నుంచి పుట్టింది. అవును బిట్ కాయిన్ రూపకర్త సతోషి నకమోటో నియంత్రణ, నమ్మకం, విశ్వసనీయతపై పునరాలోచన నుంచే పుట్టుకోచ్చింది. ఆయన అసలు బ్యాంకింగ్ వ్యవస్థ లేని ప్రపంచం కావాలని అనుకోలేదు. ఇటీవలి కాలంలో కొన్ని వారాల కిందట ప్రముఖ భారతీయ క్రిప్టో ఫ్లాట్ ఫారం కాయిన్ డీసీఎక్స్ పై సైబర్ దాడి జరిగింది. ఇది వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. అసలు దాడి ఎలా జరిగింది, ఎక్కడి నుంచి చేశారు, ఎలా ఫ్లాట్ ఫారం సర్వర్లకు యాక్సెస్ పొందారు వంటి అనేక అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కానీ ఇది ఇన్వెస్టర్లలో అసలు క్రిప్టో ఎక్స్ఛేంజీలు సేఫేనా అనే ప్రశ్నలకు ఆజ్యం పోస్తోంది. 

మనీలాండరింగ్ చట్టాల కింద క్రిప్టో సంస్థలు రిజిస్టర్ అయి ఉంటాయి. అలాగే భారతదేశ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కింద గుర్తింపు పొందిన ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ చేయటమే సేఫ్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో భద్రతా ప్రమాణాలపై ఆడిట్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తారు. పైగా కేవైసీ ప్రొటోకాల్స్ కూడా సక్రమంగా పాటిస్తారు. ఇది మీరు చేసే పెట్టుబడి ట్రాన్సాక్షన్లను సురక్షితంగా ఉండేలా చూస్తాయి. కానీ పూర్తి భద్రత విషయంలో మాత్రం గ్యారెంటీ ఇవ్వవు. 

అయితే ఈ క్రమంలో ఇన్వెస్టర్లు కూడా టెక్నాలజీపై కొంత అవగాహన పొందుతూ వారి పెట్టుబడుల విషయంలో సేఫ్టీ మెజర్స్ పాటించటం కూడా ఎక్స్ఛేంజీల రక్షణకు దోహదపడుతుంది. దేశంలోని ప్రముఖ క్రిప్టో ఫ్లాట్ ఫారం జియోటాస్ రక్షణను ఒక ఫిలాసఫీగా కొనసాగిస్తోంది. ఇన్వెస్టర్ల పెట్టుబడులను కాపాడేందుకు వారు కోల్డ్ స్టోరేజీలు, మల్టీ సిగ్నేచర్ వాలెట్లను వాడతారు. దీనికి తోడు అంతర్గతంగా ఫాలో అయ్యే సెక్యూరిటీ ప్రొటోకాల్స్ సెక్యూరిటీ బ్రీచ్ జరగటాన్ని నిరోధిస్తుందని సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ చెప్పారు. యూజర్లు కూడా తమ సెక్యూరిటీ పాలసీల గురించి వివరంగా ప్రకటించే ఎక్స్ఛేంజీలనే ఎంచుకోవాలని ఆయన సూచించారు. 

ALSO READ : GST తగ్గింపుతో చిన్న కార్లతో పాటు లగ్జరీ కార్ల రేట్లూ తగ్గుతున్నయ్..!

పెట్టుబడిదారులు తమ వాలెట్ కీ జాగ్రత్తగా ఉంచుకోకపోతే వారు తమ క్రిప్టో ఆస్తులను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలాగే ట్రేడింగ్ అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్టర్లు తమ హార్డ్ వేర్ వాలెట్లు, కస్టోడియెల్ పరిష్కారాలను కూడా మార్చుకోవటం మంచిది. భవిష్యత్తులో పెట్టుబడిదారులను ఆకట్టుకుంటున్న  క్రిప్టోలు ప్రభుత్వాల కరెన్సీలకు ప్రత్యామ్నాయం కాదు కేవలం ఒక పెట్టుబడి. అందువల్ల బ్యాంకింగ్ వ్యవస్థను క్రిప్టో ఎక్స్ఛేంజీలు రీప్లేస్ చేసే అవకాశం కలలో కూడా ఉండదు. కాబట్టి క్రిప్టో పెట్టుబడుల విషయంలో సరైన సెక్యూరిటీ ప్రొటోకాల్స్ పాటిస్తున్న ఎక్స్ఛేంజీల ద్వారా పెట్టుబడులు పెట్టడం ఎంత ముఖ్యమో వాటిపై యూజర్లు అవగాహనతో మెలగటం, భద్రతను పాటించటం కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.