డిఫెన్స్ కంపెనీలకు దిల్లీ పెద్దల నుంచి కాల్స్.. దూసుకుపోతున్న ఆ కంపెనీల స్టాక్స్..

డిఫెన్స్ కంపెనీలకు దిల్లీ పెద్దల నుంచి కాల్స్.. దూసుకుపోతున్న ఆ కంపెనీల స్టాక్స్..

Defence Stocks: రెండు రోజులుగా భారత్ పాక్ సరిహద్దుల్లో డ్రోన్లు, మిసైల్స్ దాడులు భారీగా పెరిగిపోయాయి. ప్రధానంగా క్షిపణులతో పాటు దాడులు చేసేందుకు అత్యాధునిక డ్రోన్ల వినియోగం సాయుధ దళాలకు విజయాన్ని తెచ్చిపెడుతున్న వేళ ఈ రంగాల్లోని కంపెనీ షేర్లకు మార్కెట్లో భారీగా డిమాండ్ కనిపిస్తోంది. ఇదే క్రమంలో యుద్ధ సన్నద్ధతలో భాగంగా దిల్లీకి రావాలంటూ ప్రముఖ మందుగుండు తయారీ సంస్థలకు పిలుపు రావటం సదరు కంపెనీ షేర్లను రాకెట్ వేగంతో దూసుకుపోయేలా చేస్తోంది. 

తాజాగా భారత ప్రభుత్వం దేశంలోని రక్షణ పరికరాలు, మందుగుండు సామాగ్రి తయారీ సంస్థలను దిల్లీకి రావాలని పిలిచినట్లు భారత్ ఫోర్జ్ లిమిటెడ్ చైర్మన్, సీఎండీ బాబాసాహెబ్ నీలకాంత్ కళ్యాణి పేర్కొన్నారు. వచ్చేవారం దీనికి సంబంధించిన ఆహ్వానం అందినట్లు తెలిపారు. గడచిన రెండు రోజుల్లో రక్షణ రంగంలోని అనేక కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.40వేల కోట్ల లాభపడ్డాయి. 

పాక్ తన కవ్వింపు చర్యల్లో భాగంగా సరిహద్దుల్లోని అనేక నగరాలపై చేస్తున్న డ్రోన్, క్షిపణి దాడులను ఎదుర్కోవటంలో పూర్తిగా స్వదేశంలో తయారు చేయబడిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థను భారత సాయుధ దళాలు విజయవంతంగా వినియోగించటం గమనార్హం. వాస్తవానికి దీనిని భారత్ డైనమిక్స్ సంస్థతో పాటు డీఆర్డీఓ సంయుక్తంగా రూపొందించాయి. ఇది యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను భూమిపై నుంచే గాలిలో నిర్వీర్యం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

నేడు లాభపడిన లిస్టెడ్ డిఫెన్స్ అండ్ డ్రోన్ స్టాక్స్ ఇవే..
* భారత్ డైనమిక్స్ 
* భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
* హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 
* భారత్ ఫోర్జ్
* అపోలో మైక్రో సిస్టమ్స్
* పరాస్ డిఫెన్స్
* జెన్ టెక్నాలజీస్
* డ్రోన్ కంపెనీ ఐడీయా ఫోర్జ్ 
* ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్