కోట్లలో వ్యూస్‌‌ కొల్లగొడుతున్నడు

కోట్లలో వ్యూస్‌‌ కొల్లగొడుతున్నడు

అమిత్ భదానా సోషల్ మీడియాలో పెద్ద సెలబ్రిటీ. యూట్యూబ్‌‌లో ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ వీడియోలు చేస్తుంటాడు. 1994 , సెప్టెంబర్7న ఫరీదాబాద్‌‌లో పుట్టాడు. తర్వాత వాళ్ల కుటుంబం ఢిల్లీకి మారింది. అక్కడే చదువు పూర్తి చేశాడు. యమునా విహార్‌‌‌‌, లవ్లీ బడ్స్ స్కూల్స్‌‌లో చదువు పూర్తి చేశాడు. తర్వాత, ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. లీగల్​ స్టడీస్​లో డిప్లొమా కూడా చేశాడు. రెండేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. దాంతో వాళ్ల అమ్మమ్మ, మేనమామ  అతన్ని పెంచారు. అతనికి చిన్నప్పుడు క్రికెట్ అంటే చాలా ఇష్టం. కానీ.. వాళ్ల మామయ్య కోసం క్రికెట్‌‌ని వదిలేశాడు. కాలేజీ రోజుల్లోనే ఇతరులను నవ్వించడంలో ఆనందం ఉంటుందని తెలుసుకున్నాడు అమిత్‌‌. అందుకే చదువుకునే రోజుల్లో క్లాస్‌‌రూమ్‌‌లో బాగా జోకులు పేల్చేవాడు. డబ్బింగ్‌‌తో అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. కానీ.. కాపీరైట్ సమస్య వచ్చింది. దాంతో డబ్బింగ్ వదిలి సొంతంగా వీడియోలను తీయడం మొదలుపెట్టాడు. 2012 అక్టోబర్ 24 న ఛానెల్ క్రియేట్ చేశాడు. దానికి ‘అమిత్ భదానా’ అని పేరు పెట్టాడు. అయినా 2017వరకు వీడియోలు పెట్టలేదు. ‘ఎగ్జామ్ బీ లైక్ బోర్డ్ ప్రిపరేషన్ బీ లైక్’ పేరుతో మొదటి వీడియోను అప్‌‌లోడ్‌‌ చేశాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పుడు అమిత్‌‌ పెడుతున్న వీడియోలకు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. 

సక్సెస్‌‌కు కారణం 

తన సక్సెస్‌‌కు కుటుంబంతోపాటు ఫ్రెండ్స్‌‌ అవినాష్, రోహిత్‌‌లే కారణమని అమిత్‌‌ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఎందుకంటే ఆయన సక్సెస్‌‌ వెనుక వాళ్ల కష్టం చాలానే ఉంది. వాళ్లెప్పుడూ అమిత్‌‌ వెంటే ఉండి సాయం చేశారు. అండగా నిలిచారు. అమిత్‌‌ తీసిన ప్రతి వీడియోలో వాళ్లు కూడా ఉంటారు. 

టాప్‌‌ యూట్యూబర్‌‌‌‌

అమిత్‌‌ దేశంలోనే టాప్‌‌ యూట్యూబర్లలో ఒకడిగా స్థానం దక్కించుకున్నాడు. ఛానెల్‌‌కు 23.6 మిలియన్లకు పైగా సబ్‌‌స్ర్కైబర్స్​​ ఉన్నారు. అంతమంది ప్రేమను, అభిమానాన్ని సొంతం చేసుకోవడమంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడితే కానీ ఆ గౌరవం దక్కదు. 2020 మేలో 20 మిలియన్ల మంది సబ్‌‌స్ర్కైబర్లను సంపాదించిన మొదటి ఇండియన్‌‌  ఇండివిడ్యువల్‌‌ యూట్యూబ్‌‌ కంటెంట్ క్రియేటర్‌‌‌‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. కాలేజీలు, యూనివర్సిటీల్లో కూడా చాలా ప్రదర్శనలు ఇచ్చాడు భదానా.

కోట్లలో సంపాదన

అమిత్‌‌ ఛానెల్‌‌కు నెలకు దాదాపు 50 మిలియన్ల వ్యూస్‌‌ వస్తున్నాయి. అంటే నెలకు దాదాపు 25 నుంచి 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. వీటితో పాటు చేసే ప్రమోషన్లకు కూడా కొంత డబ్బు వస్తుంది.యూట్యూబ్‌‌ నుంచి సంవత్సరానికి దాదాపు 5 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయన పెట్టే ప్రతి వీడియోకు పదిలక్షల కంటే ఎక్కువే డబ్బులు వస్తున్నాయి.  

ప్రతిదీ వైరల్‌‌ 

అమిత్‌‌ చేసే వీడియోలు 2017 నుంచే బాగా వైరల్ అయ్యాయి. అవి సోషల్ మీడియాలో ఎక్కువగా హల్‌‌చల్‌‌ చేసేవి.  దాంతో ఆయనకు పబ్లిక్‌‌లో ఫాలోయింగ్‌‌ బాగా పెరిగింది. దాంతో ఫేస్‌‌బుక్, ట్విట్టర్... ఇలా అన్ని ఫ్లాట్‌‌ఫామ్స్‌‌లో అతన్ని అభిమానించే వాళ్ల సంఖ్య పెరిగింది. అంతేకాదు యూట్యూబ్‌‌లో కేవలం 24 గంటల్లోనే 84,000+ సబ్‌‌స్ర్కైబర్లను సంపాదించి రికార్డు క్రియేట్‌‌ చేశాడు.  

ఇప్పుడు మార్కెట్‌‌లో యూట్యూబర్లకు ఉన్న  క్రేజ్‌‌ అంతా ఇంతా కాదు.. ఆ క్రేజ్‌‌తో అవకాశాలు, డబ్బు సంపాదించుకుంటున్నారు. డబ్బుతోపాటు కోట్లాది మంది అభిమానాన్ని, పేరు ప్రతిష్టలను కూడా ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ లిస్ట్​లోకే వస్తాడు అమిత్‌‌ భదానా... ఒక్క వీడియో అప్‌‌లోడ్‌‌ చేస్తే లక్షల కొద్దీ డబ్బు భదానా బ్యాంక్‌‌ బ్యాలెన్స్‌‌లో యాడ్‌‌ అవుతుంది. చిన్నప్పుడే తండ్రి చనిపోతే అమ్మమ్మ దగ్గర ఉండి పెరిగాడు. యూట్యూబ్‌‌ ఛానెల్‌‌ పెట్టి ఇప్పుడు ఫేమస్ సెలబ్రిటీ అయ్యాడు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.