ఓట్లకోసమే సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు: అమిత్ షా

ఓట్లకోసమే సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు: అమిత్ షా

సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను హోంమంత్రి అమిత్ షా ఖండించారు. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకోసమే సనాతమన ధర్మాన్ని అవమానించారని అమిత్ షా ఆరోపించారు. ఎన్నికల నేపధ్యం లో రాజస్థాన్ లో పరివర్తన్ యాత్రను ప్రారంభించిన అమిత్ షా.. దుంగార్ పూర్ లోని బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ సనాతన ధర్మంపై డీఎంకే ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

సనాతన ధర్మం సమానత్వానికి, సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని ఆదివారం తమిళనాడు యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదని అమిత్ షా దుమ్మెత్తి పోశారు. ఇండియా కూటమి ని గమండియా గాత్ బంధన్ గా అభివర్ణించిన అమిత్ షా.. ఓటు బ్యాంకు రాజకీయాలకోసం ఇండియా కూటమి ఎంతవరకైనా వెళ్లగలదని విమర్శించారు. సనాతన ధర్మం గురించి  వ్యతిరేకంగా ఎవరు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత తక్కుకవగా కనిపిస్తారని అన్నారు.