పార్టీలో చేరికలనుస్పీడప్ చేయాలి..రాజకీయ ఎత్తుగడలపై కన్నేయాలి

పార్టీలో చేరికలనుస్పీడప్ చేయాలి..రాజకీయ ఎత్తుగడలపై  కన్నేయాలి

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు అమిత్ షా సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని క్యాడర్ కు తెలియజేసి, వారిలో అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. ‘‘రాష్ట్రంలో బీఆర్ఎస్, ఎంఐఎంతో పాటు కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడలపై ఓ కన్నేసి ఉంచండి. బీఆర్ఎస్ సర్కార్ అవినీతి, అక్రమాలకు పాల్పడింది. కుటుంబ పాలన సాగిస్తోంది. వీటినే ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకోండి. ప్రజల్లోకి వెళ్లి వివరించండి. మోదీ సంక్షేమ పథకాలపై ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయండి” అని దిశానిర్దేశం చేశారు. 

పార్టీలో చేరికలను స్పీడప్ చేయాలని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్తులను చేర్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పార్టీ సీరియస్ గా దృష్టి పెట్టిన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని? ఏ జిల్లాలో ఎన్ని సీట్లు గెలుస్తం? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘‘రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. కేసీఆర్ పాలనపై విసిగెత్తిపోయిన జనం.. బీజేపీనే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. దాన్ని మనకు అనుకూలంగా మలచుకోవాలి” అని సూచించారు.