
హైదరాబాద్, వెలుగు : కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం హైదారాబాద్ రానున్నారు. శనివారం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో జరగనున్న ఐపీఎస్ ఆఫీసర్ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆయన చీఫ్ గెస్ట్ గా అటెండ్ కానున్నారు. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్‌పీఏలో)లో మొత్తం 195 మంది (74వ బ్యాచ్) ఐపీఎస్‌ల ట్రైనింగ్ పూర్తికావడంతో వారికి పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించనున్నట్లు అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ గురువారం వెల్లడించారు. ట్రైనింగ్ పూర్తి చేసిన వారిలో 129 మంది పురుషులు, 37 మంది మహిళలు సహా 29 మంది రాయల్ భూటాన్, నేపాల్‌కు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన ప్రొబేషనరీ ఐపీఎస్‌లకు అమిత్ షా ట్రోఫీలను అందజేస్తారని రాజన్ తెలిపారు.