కలిసికట్టుగా ముందుకెళ్లండి : అమిత్ షా

కలిసికట్టుగా ముందుకెళ్లండి : అమిత్ షా

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవానికి చీఫ్ గెస్టుగా ఆదివారం హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఆ తర్వాత రాష్ట్రంలోని పార్టీ పరిస్థితిపై ఫోకస్ పెట్టారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి తిరిగి జూబ్లీహిల్స్ లోని  సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్ కు వెళ్లిన ఆయన రాష్ట్ర బీజేపీ కీలక నేతలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్ లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ ముగ్గురితో అమిత్ షా సమావేశమయ్యారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ పాల్గొన్నారు. 

Also Rard:   కులవృత్తుల వారికి .. రూ. 3 లక్షల రుణాలు

ముందుగా పార్టీ ఇంచార్జీలతో సమావేశమైన అమిత్ షా వారి నుంచి రాష్ట్రంలోని పార్టీ పరిస్థితిపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అనంతరం ఈ ముగ్గురితో వేర్వేరుగా, ఆ తర్వాత ఉమ్మడిగా సమావేశమైనట్లు సమాచారం. శనివారం రాత్రి కూడా కొద్దిసేపు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో అమిత్ షా సమావేశమై రాష్ట్రంలోని పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు కలిసి సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. పార్టీలో చేరికలపై ముగ్గురు ఒకే నిర్ణయంతో ఉండాలని, చేరికలు అనేవి పార్టీ బలోపేతానికి ఉపయోగపడేలా ఉండాలని సూచించినట్లు తెలిసింది. 

 

Also Rard:   నవరాత్రులు భక్తుల పూజలు అందుకునేందుకు సిద్ధమైన గణనాథులు

సీనియర్లంతా తరుచుగా సమావేశమవుతూ సమష్టి నిర్ణయాలతో ముందుకు సాగాలని వారికి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ నోటీసులపై కూడా వీరి సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటున్న తీరు, ఆ పార్టీలో ఈ మధ్య చేరుతున్న నాయకులపై కూడా అమిత్ షా ఆరా తీసినట్లు సమాచారం. బీజేపీ నుంచి కొందరు వెళ్లిపోవడం, కొందరు లైన్ దాటి వ్యవహరించడంతో సస్పెండ్ చేసిన విషయాన్ని వీరు అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికలకు క్యాడర్ ను  సిద్ధం చేయాలని నేతలకు అమిత్ షా సూచించారు.