కులవృత్తుల వారికి .. రూ. 3 లక్షల రుణాలు

 కులవృత్తుల వారికి .. రూ. 3 లక్షల రుణాలు

న్యూఢిల్లీ: విశ్వకర్మ పథకం కింద 18 కులాలకు చెందిన చేతివృత్తుల వారికి పనిముట్ల కొనుగోలుకు, ఇతర అవసరాల కోసం రూ. 3 లక్షల వరకు ఎలాంటి గ్యారంటీ లేకుండా వడ్డీ రాయితీతో బ్యాంక్ లోన్లను ఇస్తామని మోదీ వెల్లడించారు. విశ్వకర్మలకు ఇచ్చే ఈ రుణాలకు ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదని, వారికి తానే గ్యారంటీ అని అన్నారు. చేతివృత్తుల వారు జీఎస్టీ రిజిస్టర్డ్ షాపుల నుంచే మేడ్ ఇన్ ఇండియా టూల్ కిట్లను కొనుగోలు చేయాలని ప్రధాని కోరారు. ఈ సందర్భంగా 18 చేతివృత్తులను గౌరవిస్తూ రూపొందించిన 18 పోస్టల్ స్టాంప్ షీట్లనూ ప్రధాని విడుదల చేశారు. 

Also Rard:   ఇపియాన్​ పెయిన్​ .. రిలీఫ్ ​సెంటర్ లో  ఉత్తమ చికిత్స

టూల్ కిట్ ఇ-బుక్ లెట్ తో పాటు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. సంప్రదాయ కళాకారుల నుంచి నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందేలా చూడటం, విశ్వకర్మలు ఆర్థికంగా ఎదగడమే ఈ స్కీం ముఖ్య ఉద్దేశాలని మోదీ అన్నారు. కార్యక్రమంలో18 మంది లబ్ధిదారులకు విశ్వకర్మ సర్టిఫికెట్లను ప్రధాని అందజేశారు.

పథకం వివరాలు..  కేటాయించిన మొత్తం: రూ. 13,000 కోట్లు 

లబ్ధిదారులకు మొదటి విడతలో రూ. లక్ష లోన్ ఇస్తారు. దీనిని 18 నెలల్లో తిరిగి చెల్లించాలి. ఆ తర్వాత రెండో విడతలో రూ. 2 లక్షల లోన్ ఇస్తారు. దానిని 30 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ లోన్లపై 5% రాయితీ వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. వీటిపై క్రెడిట్ గ్యారంటీ ఫీజులను కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. 
లోన్లకు అదనంగా స్కిల్ అప్ గ్రెడేషన్, టూల్ కిట్ ఇన్సెంటివ్, డిజిటల్ ట్రాన్సాక్షన్లు, మార్కెటింగ్ సపోర్ట్ వంటి వాటిలోనూ ఈ స్కీం కింద చేతివృత్తుల వారికి చేయూతనివ్వనున్నారు.