హైదరాబాద్ లో అమిత్ షా మహా పాదయాత్ర

హైదరాబాద్ లో అమిత్ షా మహా పాదయాత్ర

హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహా పాదయాత్ర  పూర్తయింది ‘లోక్‌తంత్ర బచావో.. అరాచకత హటావో’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకత్వాన్ని అంతం చేయండి) అనే నినాదంతో చేపట్టిన ఈ పాదయాత్ర గన్ ఫౌండ్రీ నుంచి ప్రారంభమై ఎంజే మార్కెట్ వరకు కొనసాగింది.

ఈ పాదయాత్రలో అమిత్ షా జాతీయ జెండా చేతబూని పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.పాదయాత్రలో పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. దీంతో పాదయాత్ర మార్గంలో సందడి నెలకొంది.

ఎంజే మార్కెట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసే ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.