రామోజీరావుతో అమిత్ షా కీలక భేటీ

రామోజీరావుతో అమిత్ షా కీలక భేటీ

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా భేటీ అయ్యారు. మునుగోడు సభ ముగిసిన అనంతరం ఆయన నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. రామోజీరావు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. తర్వాత రామోజీరావుతో అమిత్ షా, కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశమున్నట్లు సమాచారం. దాదాపు 45 నిమిషాల పాటు రామోజీ రావు, అమిత్‌షా భేటీ జరగనున్నట్లు తెలిసింది.

రామోజీ రావుతో భేటీ ముగిసిన తర్వాత అమిత్ షా నేరుగా శంషాబాద్ నోవాటెల్ కు వెళ్లనున్నారు. నోవాటెల్ లో అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలవనున్నారు. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఆసక్తిగా మారింది. మరోవైపు నోవాటెల్ లో బీజేపీ ముఖ్య నేతలతో డిన్నర్ మీటింగ్ లో అమిత్ షా పాల్గొంటారు.