భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్‌‌‌‌ షా..ఆలయంలో ప్రత్యేక పూజలు.. 

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్‌‌‌‌ షా..ఆలయంలో ప్రత్యేక పూజలు.. 
  • కాంగ్రెస్‌‌‌‌, ఇండీ కూటమి నేతలు కళ్లు తెరవాలి:బండి సంజయ్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్‌‌‌‌ షా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్‌‌‌‌లో పారిశ్రామికవేత్త రామేశ్వర్‌‌‌‌రావు, మీడియా అధినేత నరేంద్ర చౌదరితో వేర్వేరుగా భేటీ అయ్యారు.

దేశ రాజకీయాలు, తెలంగాణలో బీజేపీ బలోపేతంపై చర్చించినట్టు సమాచారం. పార్టీకి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోవడంతోపాటు వారి సహకారం కోరినట్టు తెలిసింది. అంతకుముందు బేగంపేట విమానాశ్రయంలో అమిత్‌‌‌‌ షాకు కేంద్రమంత్రులు కిషన్‌‌‌‌రెడ్డి, బండి సంజయ్‌‌‌‌, ఎంపీలు, బీజేపీ ముఖ్యనేతలు స్వాగతం పలికారు.

పాదయాత్ర గ్రాండ్‌‌‌‌ సక్సెస్‌‌‌‌..

హైదరాబాద్‌‌‌‌లో అమిత్‌‌‌‌ షా నిర్వహించిన మహా పాదయాత్ర గ్రాండ్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ అయిందని కేంద్రమంత్రి బండి సంజయ్‌‌‌‌ అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌‌‌‌, ఇండీ కూటమి నేతలు కళ్లు తెరిచి, ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌‌‌‌ కూటమికి మహా పాదయాత్ర చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. లేదంటే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌‌‌‌కు భంగపాటు తప్పదని హెచ్చరించారు