కశ్మీర్ లో హైటెన్షన్: పరిస్థితులను సమీక్షిస్తున్న అమిత్ షా

కశ్మీర్ లో హైటెన్షన్: పరిస్థితులను సమీక్షిస్తున్న అమిత్ షా

కశ్మీర్ లో హైటెన్షన్ నేపథ్యంలో… పరిస్థితులపై సమీక్షిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్లమెంట్ లోని తన ఛాంబర్ లో హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ లతో అమిత్ షా సమావేశమయ్యారు. కశ్మీర్ గురించే ప్రధాన చర్చ జరుగుతోంది. మరోవైపు రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సాధారణంగా ప్రతీ బుధ లేదంటే గురువారాల్లో కేబినెట్ సమావేశం ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా సోమవారం కేబినెట్ సమావేశం జరుపుతున్నారు