
JNU లో ఆదివారం జరిగిన ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. జేఎన్‌యూలో జరిగిన ఘటనపై అనిల్‌తో అమిత్ షా చర్చించారు. జేఎన్‌యూ ప్రతినిధులను పిలిపించి మాట్లాడాలని అనిల్‌కు సూచించారు హోం మంత్రి.
దాడి ఘటనపై జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్ ఎం.జగదీష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని కోరారు. చదువుల కొనసాగింపునకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, వింటర్ సెమిస్టర్ రిజిస్ట్రేషన్‌ను కూడా సజావుగా సాగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
యూనివర్శిటి పరిధిలోని సబర్మతి హాస్టల్ వార్డెన్ ఆర్. మీనా ఈ ఘటనపై బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.
Related News: ఈ క్యాంపస్ లో నేనుండలేను.. వెళ్లిపోతున్నా..