అమిత్‌ షాకు కరోనా నెగటివ్‌

అమిత్‌ షాకు కరోనా నెగటివ్‌
  • వెల్లడించిన ఎంపీ మనోజ్‌ తివారీ
  •  వారం రోజుల పాటు ట్రీట్‌మెంట్‌ తీసుకున్న మంత్రి

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కరోనా నుంచి కోలుకున్నారు. ఆదివారం ఉదయం ఆయనకు కరోనా నెగటివ్‌ వచ్చిందని ఎంపీ మనోజ్‌ తివారీ ట్వీట్‌ చేశారు. వారం రోజుల ట్రీట్‌మెంట్‌ తర్వాత షాకు కరోనా నెగటివ్‌ వచ్చింది. కరోనా పాజిటివ్‌ రావడంతో అమిత్‌ షా గురుగ్రామ్‌లోని మెడంటా హాస్పిటల్‌లో చేరి ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, కాంటాక్ట్‌ అయిన ప్రతి ఒక్కరు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లాలని అమిత్‌ షా గతంలో ట్వీట్‌ చేశారు.