అమిత్‌ షాకు నెగటివ్‌ రాలేదు.. మరో రెండ్రోజుల్లో టెస్టులు చేస్తారు

అమిత్‌ షాకు నెగటివ్‌ రాలేదు.. మరో రెండ్రోజుల్లో టెస్టులు చేస్తారు
  • క్లారిటీ ఇచ్చిన హోం మినిస్ట్రీ

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు కరోనా నెగటివ్‌ వచ్చిందనే వార్త నిజం కాదని హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆయనకు మరో రెండ్రోజుల్లో టెస్టులు చేస్తారని చెప్పింది. అమిత్‌ షాకు కరోనా నెగటివ్‌ వచ్చిందని ఎంపీ మనోజ్‌ తివారీ ట్వీట్‌ చేయడంపై హోం మినిస్ట్రీ క్లారిటీ ఇచ్చింది. దీంతో మనోజ్‌ తివారీ ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. కాగా.. అమిత్‌ షా కోలుకుంటున్నారని, ఆయన యాక్టివ్‌గా ఉంటూ మినిస్ట్రీకి సంబంధించి ఫైల్స్‌ను హాస్పిటల్‌ నుంచి క్లియర్‌‌ చేస్తున్నారని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి చెప్పారు. వచ్చే వారంలో టెస్టు నెగటివ్‌ రాగానే డిశ్చార్జ్‌ అవుతారని చెప్పారు.