సోనిబాయి ఇంట్లో టిఫిన్ చేసి.. టీ తాగిన అమిత్ షా

సోనిబాయి ఇంట్లో టిఫిన్ చేసి.. టీ తాగిన అమిత్ షా

హైదరాబాద్: ఈ మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా… రంగనాయక్ తండాలోని సోనీబాయి నాయక్ ఇంటికి వెళ్లారు. సోనీబాయి ఇంట్లో  8 నిమిషాల సేపు … అమిత్ షా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు ఉన్నారు. సోనీ నాయక్ కుటుంబ సభ్యులకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు అమిత్ షా. సోనీ నాయక్ ఇంట్లో రొట్టె, ఉప్మా తిన్నారు అమిత్ షా. ఆ తర్వాత సోనీబాయి నాయక్ అందించిన టీ తాగారు.

ఊర్లో సమస్యలపై అమిత్ షాకు వినతి పత్రం ఇచ్చింది సోనినాయక్. ఢిల్లీకి వచ్చి కలవాలని సోనీబాయి నాయక్ కుటుంబానికి అమిత్ షా చెప్పారు. ప్రభుత్వంపై పోరాడు.. అవసరమైతే గన్ మెన్ లను ఇస్తానని సోనీ నాయక్ కు చెప్పారు అమిత్ షా.