IBM Layoffs: మరోసారి లేఆఫ్స్ ప్రకటించిన ఐబీఎం..ఈ ఏడాది చివర్లో భారీగా తొలగింపులు..2శాతం పడిపోయిన షేర్లు

IBM Layoffs: మరోసారి లేఆఫ్స్ ప్రకటించిన ఐబీఎం..ఈ ఏడాది చివర్లో భారీగా తొలగింపులు..2శాతం పడిపోయిన షేర్లు

టెక్​ జెయింట్​ IBM మరోసారి లేఆఫ్స్​ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఉద్యోగులను తొలగించనుంది. ఇంజనీరింగ్ ఇంజనీరింగ్, క్లౌడ్​ విభాగాల్లో వర్క్​ ఫోర్స్​ ను తగ్గించుకోనున్నట్లు తెలిపింది. ఈ విభాగాల్లో పనిచేసే ఆర్కిటెక్ట్స్​, ఇంజనీరింగ్​ స్టాఫ్​పై లేఆఫ్స్​ ప్రభావం పడనుంది.  అధిక మార్జిన్ ఉన్న సాఫ్ట్‌వేర్, AI సర్వీసులపై దృష్టి సారించడమే లక్ష్యంగా పెట్టుకున్న టెక్​ జెయింట్.. తక్కువ ప్రభావవున్న శాఖల నుంచి ఖర్చును తగ్గించుకుంనేదుకు ఉద్యోగులను తొలగించేందుకు ఈ నిర్ణయంతీసుకుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 

అమెరికా ,ఇండియా లోని ఉద్యోగులపై  లేఆఫ్స్​ ప్రభావం ఎక్కువగా ఉంటుందని  తెలుస్తోంది. స్కిల్స్‌ మార్పులు, AI/క్లౌడ్‌ టెక్నాలజీలలో నైపుణ్యం అవసరం కూడా లేఆఫ్స్ కు ఓ కారణంగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐబీఎం దాదాపు 2లక్షల 70 వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది. తక్కువల తక్కువ 2 శాతం ఉద్యోగులను తీసేసినా దాదాపు 5వేలమందిపై ప్రభావం పడుతుంది. వేలాది ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని రిపోర్టులు చెబుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో కొద్ది శాతం మంది మాత్రమే ప్రభావితమవుతారని కంపెనీ స్పష్టం చేస్తోంది.  ఖర్చు తగ్గింపు, కొత్త టెక్నాలజీ లపై కంపెనీ దృష్టి సారించడంతో ఉద్యోగుల తొలగింపులు తప్పడం లేదని కంపెనీ చెబుతోంది. 

లేఆఫ్స్ ప్రకటనతో IBM షేర్లు 2శాతం తగ్గాయి..

ఈ ప్రకటన తర్వాత IBM షేర్లు దాదాపు 2శాతం తగ్గాయి. అయితే అవి 2024 నుంచి ఇప్పటికీ 35శాతం లాభాల్లో ఉంది. అయితే ఆదాయంలో కోల్పోయిన వేగాన్ని తిరిగి పొందేందుకు AI ,ఆటోమేషన్ టెక్నాలజీలపై IBM దృష్టి, క్లౌడ్ లపై పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తోంది. స్థిరమైన ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తొలగింపులు చేస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 

IBM ఉద్యోగాల తగ్గింపు నిర్ణయం టెక్ రంగంలో మారుతున్న దిశల్ని సూచిస్తోంది. లేటెస్ట్​ టెక్నాలజీలపై దృష్టి..ఉద్యోగుల పరంగా ఓ సవాల్​ గా మారుతున్న తీరు.. కంపెనీల పరంగా వ్యూహాత్మక మార్పును స్పష్టం చేస్తోంది.