ఎయిర్ హోస్టెస్ గా 22 నెలల పాప.. యంగెస్ట్ స్టీవార్డెస్..ఎంత క్యూట్ గా ఉందో..ఎయిర్ హోస్టెస్ డ్రెస్ లో విమానం మొత్తం తిరుగుతూ ప్రయాణికులను తనఅందమైన చిరునవ్వుతో పలకరిస్తూ ఆహ్లాద పరిచింది. ఈ చిన్నారి ఎయిర్ హోస్టెస్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. నిజంగానే ఆ పాపను ఎయిర్ హోస్టెస్?.. లేక ఎందుకు పాప ఎయిర్ హోస్టెస్ లా కనిపించిందో.. ఆ కథేంటో చూద్దాం..
సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో 22 నెలల చిన్నారి ఎయిర్ హోస్టెస్ పాత్రను అద్భుతంగా పోషిస్తున్నట్లు చూపించే హార్ట్ టచింగ్ వీడియో వైరల్‌గా మారింది. కియారా అనే ఆ చిన్నారి అక్టోబర్ 28న తన తల్లిదండ్రులతో కలిసి షాంఘై నుండి విమానం ఎక్కింది..సింగపూర్ ఎయిర్‌లైన్స్ కెబాయా అంటే సిబ్బంది డ్రెస్ పిల్లల వెర్షన్‌లో ధరించి అటు ప్రయాణీకులనుః, ఇటు సిబ్బందిని అబ్బుర పర్చింది.
ఏంటీ కథ..
కియార తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. కియారా ప్రయాణంలో ధరించేందుకు ఓ స్పెషల్ డ్రెస్‌ను కొనుగోలు చేశారు. అది సింగపూర్ ఎయిర్ లైన్స్ లో పనిచేసే ఎయిర్ హోస్టెస్ డ్రెస్ ను పోలి ఉంది. విమానం ఎక్కగానే అందులో కనిపించిన ఎయిర్ హెస్టెస్ లు తన లాంటి డ్రెస్ వేసుకోవడంతో కియారా చాలా ఎగ్జైటింగ్ గా ఫీలయ్యింది.. వారితో కలిసి విమానం మొత్తం కలియ తిరిగింది. ఎయిర్ హెస్టెస్ లా నటిస్తూ.. విమానం గాల్లో ఉన్నంత సేపు అటు ప్రయాణికులను, ఇటు సిబ్బంది ని చిరునవ్వుతో పలకరిస్తూ ఎంటర్టైన్ చేసింది.
విమాన సిబ్బంది కూడా షిఫ్ట్ సమయంలో కియారా సాయాన్ని తీసుకుంటూ వారి టీంలో ఓ మెంబర్ గా చేర్చుకున్నారు. అంతే కాదు కియారా యాక్టివిటీస్ కి ఫిదా అయిన ఎయిర్ లైన్స్ సిబ్బంది కియారాతో ఫొటోలు, సెల్ఫీలు దిగారు.
ఇక ఇదంతా గమనిస్తూ తబ్బి ఉబ్బిబ్బయిన కియారా తల్లి .. కూతురి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి నెటిజన్లతో పంచుకున్నారు. నా కూతురి మొదటి విమాన ప్రయాణం ఇది.. ఇది మా జ్ణాపకాల్లో ప్రత్యేకం..షాంఘై నుంచి తిరిగి వచ్చే క్రమంలో ఈ SQ కెబాయ్ ని కొనుగోలు చేశాం. మా పాప డ్రెస్, ఎయిర్ లైన్స్ సిబ్బంది డ్రెస్సు సేమ్ టు సేమ్ కావడంతో మా అమ్మాయి వారితో కలిసి ఎయిర్ హోస్టెస్ లా సర్వ్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ కియారా తల్లి రాసింది.
ఇక నెటిజన్లు కియారా ను చూసి SQ లో కియారా అందంగా ఉంది.. ఆమె సేవలు చాలా బాగున్నాయి.. 10కి 10 మార్కులు ఇవ్వొచ్చు.. అంటూ సరదగా కామెంట్లు పెట్టారు.
