
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ శరవేగంగా ముందుకు సాగుతోంది. ఈ సినిమాకు మహానటి ఫేం నాగ్ అశ్విన్ డైరెక్షన్ తో తెరకెక్కుతుంది. ప్యాన్ ఇండియా లెవల్ లో చిత్రీకరిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీలో సినిమా షూటింగ్ జరుగుతోంది. అబితాబ్ బచ్చన్‌తో చిత్రీకరిస్తున్న యాక్షన్ సీన్స్ పై షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తూ ఆయన పక్కటెముల వద్ద గాయమైంది. ప్రమాదం జరిగిన అనంతరం అమితాబ్ ను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం అమితాబ్ ముంబైకి పయనమయ్యారు. అమితాబ్‌కు రెండు వారాలు బెడ్ రెస్ట్ అవసరమని తర్వాత షూటింగ్ లో పాల్గొనచ్చని వైద్యులు సూచించారు.
తెలుగు పరిశ్రమలో దీపికా పదుకొణె అరంగేట్రం చేస్తున్న మొదటి సినిమా ఇది. ఇందులో దిశా పటానీ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కథ కొనసాగనుంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కాకపోతే జనవరి 12,2024న సినిమాని విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది.