KBC Promo: పాతికేళ్ల ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’.. ఇంట్రెస్టింగ్‌గా కొత్త సీజన్‌‌ ప్రోమో.!

KBC Promo: పాతికేళ్ల ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’.. ఇంట్రెస్టింగ్‌గా కొత్త సీజన్‌‌ ప్రోమో.!

చరిత్ర సృష్టించిన బుల్లితెర షోలలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (Kaun Banega Crorepati) ఒకటి. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitab Bachhan) హోస్ట్ గా 2000 సంవత్సరంలో మొదలైన ప్రముఖ ఈ క్విజ్ షో.. గత 22 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అంతేకాదు..ఈ ప్రోగ్రాం వ్యూవర్స్ ను టీవీల ముందు కట్టిపడేస్తుందంటే ఆశ్చర్యం లేదు.

16 ఎపిసోడ్లు కంప్లీట్ చేసికున్న ఈ కౌన్ బనేగా కరోడ్ పతి షో కొత్త సీజన్‌‌ రాబోతోంది. ఈ సీజన్‌కు కూడా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకూ 16 సీజన్స్‌‌తో సక్సెస్‌‌ఫుల్‌‌ రన్ కాగా, తాజాగా 17వ సీజన్‌‌ను అనౌన్స్‌‌ చేశారు.

ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల  చేశారు. ఆగస్టు 11 నుంచి టీవీలో ప్రసారం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9 గంటలకు సోనీ ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌ టీవీతో పాటు సోనీ లివ్‌‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జూలై 3,2000న ప్రారంభమైన ఈ షో ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.