గ్రీన్ ఇండియా చాలెంజ్‌: మొక్క నాటిన బిగ్ బీ

V6 Velugu Posted on Jul 27, 2021

హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో అమితాబ్‌తోపాటు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కూడా పాల్గొన్నారు. ఒక సినిమా షూటింగ్‌లో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో ఉన్న అమితాబ్, నాగార్జునను ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కలిశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనాల్సిందిగా వారిని సంతోష్ కోరారు. దీంతో బిగ్ బీ, నాగ్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో నిర్మాత అశ్వినీదత్, ఫిలిం సిటీ ఎం.డి విజయేశ్వరి కూడా పాల్గొన్నారు. 

Tagged Nagarjuna, Amithab Bachchan, MP Joginipally Santosh Kumar, Green India, Ashwinidath, Vijayeshwari

Latest Videos

Subscribe Now

More News