
బిగ్ బి అమితాబ్ ఎక్స్ లో చేసిన ఎమోషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఓ జర్నలిస్ట్ పోస్ట్ చేసిన డైవర్స్ పోస్ట్ ను అభిషేక్ బచ్చన్ లైక్ చేసిన రెండు రోజుల తర్వాత అమితాబ్ ఈ ఎమోషనల్ పోస్ట్ చేయటం చర్చనీయాంశం అయ్యింది.ఈ ట్వీట్ లో లైఫ్ ఈజ్ నీవే ఈజీ అంటూ అమితాబ్ పోస్ట్ చేయటం అభిషేక్, ఐశ్వర్యాల డైవర్స్ పై అనుమానాలకు చేకూర్చుతోంది.
రెండు రోజుల కిందట హీనా ఖండేల్వాలా అనే జర్నలిస్ట్ బ్రోకెన్ హార్ట్స్ ఉన్న ఇమేజ్ షేర్ చేస్తూ " ప్రేమ ఈజీగా ఉండటం ఎప్పుడైతే ఆగిపోతుందో, అప్పుడు దంపతులు దారులు వేరవుతాయి. ఇదే గ్రే డైవర్స్ పెరగటానికి కారణమా" పోస్ట్ ను షేర్ చేసింది హీనా.
T 5076 - ... back to arduous work .. tough .. but life is never easy .. pic.twitter.com/9MhrO77OVY
— Amitabh Bachchan (@SrBachchan) July 18, 2024
డైవర్స్ గురించి హీనా షేర్ చేసిన పోస్ట్ అభిషేక్ లైక్ చేయటం అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఈ నేపథ్యంలో అమితాబ్ ఎమోషనల్ పోస్ట్ చేయటంతో మళ్ళీ అభిషేక్, ఐశ్వర్యాల డైవర్స్ అంశం తెరమీదకు వచ్చింది. మరి, ఈ రూమర్స్ పై అభిషేక్, ఐశ్వర్యాలు స్పందించి క్లారిటీ ఇస్తారా లేదా వేచి చూడాలి.