మంచు విష్ణు లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ విషయాన్ని మరోసారి కన్‌ఫర్మ్ చేస్తూ డిసెంబర్‌లోనే ఈ సినిమా రాబోతోందని విష్ణు ట్వీట్ చేశారు.
మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందిస్తున్నాడు. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు.