అమితాబ్‌‌కు సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్

అమితాబ్‌‌కు సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్

ముంబై: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సర్జరీ చేయించుకోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆపరేషన్ చేయించుకోనున్నట్లు బిగ్ బీ చెప్పారు. మరిన్ని విషయాలు చెప్పాలనుందని, అయితే ఎక్కువగా రాయలేకపోతున్నానని బ్లాగ్‌‌లో అమితాబ్ చెప్పారు. దీంతో ఆయన మెడికల్ కండీషన్‌‌పై ఫ్యాన్స్‌‌ కంగారు పడుతున్నారు. అమితాబ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం చెహరే, ఝుండ్ మూవీల్లో బిగ్ బీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సర్జరీ తర్వాత వెంటనే వికాస్ బెహల్ సినిమా షూటింగులో పాల్గొంటానని అమితాబ్ తెలిపారు.