- డిప్యూటీ సీఎం భట్టి సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ నందిని
మధిర, వెలుగు: మనిషికి జీవనధారం మొక్కలేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ మల్లు నందిని తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడులో ఆమె జన్మదిన వేడుకలను షేర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు.
పట్టణంలోని పలు చోట్ల బర్త్ డే వేడుకలను గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఈ కార్యక్రమంలో షేర్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ గోపాలరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మిరియాల రమణగుప్త, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, రిటైర్డ్ ఎంపీడీఓ మాధవరపు నాగేశ్వరావు పాల్గొన్నారు.
