పవన్ మహావీర్ హీరోగా శివాల ప్రభాకర్ దర్శకత్వంలో శైలజ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి’. వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్, ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి కే అశోక్ కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు విఎన్ ఆదిత్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. తమను సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నటీనటులు, దర్శక నిర్మాతలు థ్యాంక్స్ చెప్పారు.
