కిషన్ రెడ్డికి OSD గా ఆమ్రపాలి

కిషన్ రెడ్డికి OSD గా ఆమ్రపాలి

జీహెచ్‌ఎంసీలో విధులు నిర్వహిస్తున్న ఐఎఎస్ అధికారి ఆమ్రపాలి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి కొలువులో చేరనున్నారు. కిషన్ రెడ్డి ప్రైవేట్ కార్యదర్శిగా ఆమ్రపాలిని నియమించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. ఆమ్రపాలితో పాటు మరో అధికారి  కె.శశికిరణాచారి… అడిషనల్‌ పీఎస్‌గా వెళ్లనున్నారు. అయితే దీనికి తెలంగాణ ప్రభుత్వం నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది.

గతంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలి బదిలీపై GHMCకి వచ్చి అడిషనల్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే తన బ్యాచ్‌మేట్ అయిన ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను ఆమ్రపాలి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన స్వస్థలం ఢిల్లీ. ప్రస్తుతం అక్కడే విధులు నిర్వహిస్తున్నారు.