
హైదరాబాద్, వెలుగు: కన్జూమర్ డ్యూరబుల్స్ కంపెనీ ఉషా ఇంటర్నేషనల్ ఏరోఎడ్జ్, ఏరోఎడ్జ్ ప్లస్ ఫ్యాన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఏరో ఎడ్జ్ప్లస్ఫ్యాన్లకు బీఈఈ ఫైవ్-స్టార్ రేటింగ్ ఉండటం వల్ల కరెంటును తక్కువగా వాడుకుంటాయి. నిమిషానికి 350 ఆర్పీఎం వేగాన్ని, 220 ఘనమీటర్ల గాలి డెలివరీని అందిస్తాయి.
వేగంగా చల్లగాలిని అందించడానికి వీటిలో బూస్ట్ మోడ్ ఉంటుంది. టైమర్, ఎల్ఈడీ స్పీడ్ ఇండికేటర్లు కూడా ఉంటాయి. ఏరోఎడ్జ్ ఫ్యాన్‌కు 350 ఆర్పీఎం మోటార్ ఉంటుంది. నిమిషానికి 220 ఘన మీటర్ల గాలి ప్రవాహాన్ని అందిస్తుంది. బీఎల్డీసీ మోటార్, 100శాతం కాపర్ వైండింగ్ దీని ప్రత్యేకతలు.