ఇమామీకి రాశీ ఖన్నా ప్రచారం

ఇమామీకి రాశీ ఖన్నా ప్రచారం

హైదరాబాద్​, వెలుగు: ఇమామీ లిమిటెడ్ తన  కొత్త  ప్రొడక్టుల ప్రచారం కోసం కోసం నటి రాశీ ఖన్నాను బ్రాండ్​ అంబాసిడర్​గా నియమించుకుంది. 'ప్యూర్ గ్లో' పేరుతో వస్తున్న ఈ ఉత్పత్తులు చర్మానికి స్వచ్ఛమైన కాంతిని అందించడానికి ప్రత్యేకంగా తయారు చేశామని తెలిపింది. ఈ క్రీములు చర్మాన్ని లోతుగా శుభ్రపరచడానికి, తేమను అందించడానికి, సహజమైన మెరుపును తీసుకురావడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నాయి.

వీటిని సహజ పదార్థాలతో తయారు చేశామని,   అన్ని రకాల చర్మాలకు అనుకూలంగా ఉంటాయని ఇమామీ తెలిపింది. ఈ విషయమై రాశీ ఖన్నా మాట్లాడుతూ, ఇమామీ వంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. 'ప్యూర్ గ్లో' శ్రేణిలో ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సీరమ్  సన్‌‌స్క్రీన్ వంటి వివిధ రకాల ఉత్పత్తులు  ఉంటాయి.